మహేష్ కోసం చైతూకి హ్యాండ్ ఇచ్చాడుగా…!

మహేష్ కోసం చైతూకి హ్యాండ్ ఇచ్చాడుగా…!

Published on May 2, 2020 7:00 AM IST

మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాంతో కన్ఫర్మ్ అయ్యింది. దీనిపై డైరెక్టర్ పరుశురాం స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కానుకగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని ఆయన చెప్పారు. అలాగే మహేష్ గత చిత్రాల మాదిరి ఇందులో ఎటువంటి సోషల్ మెస్సేజ్ ఉండదు అన్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది.

ఐతే గతంలో పరుశురాం హీరో నాగ చైతన్యతో ఓ మూవీ కమిట్ అయ్యారు. ఆ సినిమాకి సంబంధిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. కొద్దిరోజులలో ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగాల్సిన ఉండగా మహేష్ తో అవకాశం వచ్చింది. దీనితో పరుశురాం చైతూ ప్రాజెక్ట్ పక్కన పెట్టి మహేష్ మూవీ పట్టాలెక్కించనున్నాడు. ఇదే విషయం పరుశురాం ని అడిగితే.. మహేష్ మూవీ అనంతరం చైతూతో మూవీ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు