తెలుగంటే ప్రాణం అంటున్న స్టార్ డైరెక్టర్ !

దర్శకుడు మారుతి తెలుగంటే తనకు ప్రాణం అంటున్నాడు. తెలుగు వారందరికీ తనదైన శైలిలో తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాడు. షేక్ స్పియర్ గొప్పోడే, కానీ నాకు సీతారామ శాస్త్రే దేవుడు. అవెంజర్స్ అద్భుతమే, కానీ నాకు బాహుబలే బ్రహ్మాండం. విల్ల్ స్మిత్ తోపే, కానీ నాకు చిరంజీవే హీరో. ఇంగ్లీష్ ఇష్టమే, కానీ తెలుగంటే మాత్రం ప్రాణం. తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చెబుతున్నాడు .

ఇక మారుతి తరువాత సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా మారుతి, నానితో కలిసి మరొక సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో వినిపించింది. ఇక మారుతి దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. \

Exit mobile version