‘ది రాజా సాబ్’పై దర్శకుడు మారుతి సాలిడ్ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి హార్రర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న అభిమానుల నుంచి గతకొద్ది రోజులుగా వినిపిస్తోంది. గతంలో ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కానీ, ఈ సినిమా పనుల్లో ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై దర్శకుడు మారుతి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.

ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింతగా పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో త్వరలోనే రాజా సాబ్ నుంచి త్వరలోనే ఓ సాలిడ్ అప్డేట్ అయితే రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version