‘హిట్ 4’ పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్!

మన టాలీవుడ్ నుంచి ఆడియెన్స్ కి క్రేజీ ట్రీట్ ని బిగ్ స్క్రీన్ పై అందిస్తున్న దర్శకుల్లో యువ దర్శకుడు శైలేష్ కొలను కూడా ఒకరు. మరి శైలేష్ తెరకెక్కించిన హిట్ ఫ్రాంచైజ్ సినిమాటిక్ యూనివర్స్ అంతకంతకు పెద్దదిగా మారుతూ వస్తుండగా ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు వరకు మూడు భాగాలు వచ్చాయి. అయితే ఈ మూడింటి తర్వాత నాలుగో సినిమాగా హిట్ 4 రానుంది.

మరి ఈ నాలుగో చిత్రంలో తమిళ నటుడు కార్తీ నటిస్తుండగా ఈ సినిమాపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చిన మూడు హిట్ సినిమాలుకి మించి పూర్తిగా హిట్ 4 డిఫరెంట్ గా ఉండబోతుంది అని తాను చెప్పారు. దీనితో ఈసారి కంప్లీట్ కొట్టుట ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుకోవచ్చు. ఆల్రెడీ కార్తీ ఎంట్రీతో భారీ హైప్ సెట్టయ్యింది. తనపై హిట్ 4 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.

Exit mobile version