‘సితార’లో పవన్ దర్శకుడు.. నిజమేనా ?

Harish-Shanka

దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా చేస్తున్నాడు. పవన్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్నాయి, ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. ఐతే, ఇప్పుడు హరీష్ శంకర్ తర్వాత సినిమా పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ తన తర్వాత సినిమాను సితార సంస్థలోనే చేయబోతున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. కాకపోతే, ప్రస్తుతం విజయ్ హీరోగా మైత్రీలో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు హరీష్ శంకర్ వెయిట్ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. ఒకవేళ వెయిట్ చేస్తే.. హరీష్ శంకర్ – విజయ్ దేవరకొండ – సితార కలయికలో సినిమా రాబోతుంది.

Exit mobile version