కొత్త నటీనటులతో “మ్యానిప్యూలేటర్” – బి. గోపాల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్!

కొత్త నటీనటులతో “మ్యానిప్యూలేటర్” – బి. గోపాల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్!

Published on Aug 12, 2025 7:12 AM IST

Manipulator

దర్శకుడు బి. గోపాల్ చేతుల మీదుగా “మ్యానిప్యూలేటర్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మొదట “ఏ స్టార్ ఈజ్ బార్న్”గా ప్రకటించిన టైటిల్‌ను ఇప్పుడు “మ్యానిప్యూలేటర్”గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కథ–కథనం–మాటలు–దర్శకత్వం విజే సాగర్, నిర్మాణం సి. రవి సాగర్ & విజే సాగర్ సంయుక్తంగా, సి ఆర్ ప్రొడక్షన్స్ మరియు విజే ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి లతో పాటు 43 మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కంటెంట్‌పై దృష్టి పెట్టిన పక్కా కల్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా “మ్యానిప్యూలేటర్” రాబోతోందని టీం చెబుతోంది.

ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన బి. గోపాల్ మాట్లాడుతూ, “టైటిల్ యువతకు కనెక్ట్ అవుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు; ఈ సినిమా కూడా అదే వరుసలో నిలుస్తుంది” అన్నారు.

సంగీతం సునీల్ కశ్యప్ అందించగా, మొత్తం ఐదు భిన్నమైన పాటలు ఉన్నాయి. సాహిత్యం తనికెళ్ల శంకర్, వరికుప్పల యాదగిరి, విశ్వనాథ్ రచించారు. త్వరలో గ్రాండ్ ఆడియో లాంచ్ జరిపి, విడుదలకు సిద్ధం చేయనున్నారు.

తాజా వార్తలు