డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ ఆయన అందుకున్నారు. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 మల్టీ స్టారర్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన అనిల్, 2020 లో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఐతే ఈ దర్శకుడు ఇటీవల యంగ్ డైరెకర్ తరుణ్ భాస్కర్ టాక్ షోలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎవరిని డైరెక్ట్ చేయాలనేది మీ డ్రీం అని అడుగగా ఆయన బాలకృష్ణ అలాగే మోక్షజ్ఞను డైరెక్ట్ చేయాలనేది నా డ్రీం అని చెప్పుకొచ్చారు. బాలయ్యతో అంటే ఒకే కానీ మోక్షజ్ఞ తో మూవీ చేయాలనుకున్న ఆయన కల నెరవేరుతుందా అనేది మాత్రం డౌటే. ఎందుకంటే మోక్షజ్ఞ సినిమాలపై ఆసక్తి లేదంటూ బాలయ్యతో ఇప్పటికే చెప్పినట్లు వస్తున్న సమాచారం. మోక్షజ్ఞ మనసు మారి సినిమాలలోకి వస్తే ఆయన కోరిక తీరొచ్చు.