సూపర్ స్టార్ నెక్స్ట్ అడుగు గ్లోబల్ లెవెల్లోనే అని ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఉన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు నవంబర్ లో బిగ్ డే ఎదురు చూస్తోంది. అయితే ఈ నవంబర్ 15న భారీ ఈవెంట్ తో ఓ గ్రాండ్ రివీల్ ఉంది అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది.
మరి చరిత్రలోనే మొదటిసారిగా ఒక ఈవెంట్ ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లైవ్ లో స్ట్రీమ్ చేయడం ఈ సినిమా తోనే మొదలవుతుంది. పాపులర్ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ వారు ఈ సినిమా ఫస్ట్ రివీల్ ని చేయనున్నారు అనేది అనధికారికంగా బయటకి రావడం మొదలు సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా పోయింది.
ఇక దానికి తోడు ప్రతీ రోజు జియో హాట్ స్టార్ టీం గ్లోబ్ ట్రాటర్ కోసం వేస్తున్న ఒకో పోస్ట్ తో మహేష్ బాబు అభిమానులని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నట్టు అయ్యింది అని చెప్పాలి. ఇలా ఆ డేట్ వచ్చే వరకు అలానే ఆ అనౌన్స్మెంట్ వీడియో వచ్చేవరకు మాత్రం సోషల్ మీడియాలో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది అని చెప్పాలి.
Good morning to the Maasais of Serengeti! ????#GlobeTrotter #noveMBerwillbehiSStoRic pic.twitter.com/rhxKTuqi72
— JioHotstar Telugu (@JioHotstarTel_) November 4, 2025


