కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్ని మూసేశారు. సినిమాల షూటింగ్ లు ఆపేశారు. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో.. ఓపెన్ చేసిన తరువాత అసలు జనం స్పందన ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా పాల్గొన్న ఓ డిబేట్ లో మాట్లాడుతూ.. ‘థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అనే విషయం పై క్లారిటీ లేకుండా సినిమాల షూటింగ్ ను ప్లాన్ చెయ్యలేమని.. ముందు మనకు థియేటర్స్ కు సంబంధించి క్లారిటీ రావాలని అన్నారు.
కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు. మరో రెండు వారాల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ‘ఎఫ్ 2’ సీక్వెల్ లో అందరూ అనుకున్నట్లు మూడో హీరో ఉండరని ఇప్పటికి అనిల్ రావిపూడి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. ‘ఎఫ్ 2’లో ఉన్న నటీనటులతో పాటు వారి పాత్రలు కూడా ‘ఎఫ్ 3’లో సేమ్ అలాగే ఉంటాయట. వెంకీ – వరుణ్ తేజ్ జీవితాలలో తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సీక్వెల్ నడుస్తోందని తెలుస్తోంది. అంటే వారి భార్యలతో వచ్చే మరెన్నో సమస్యల సమ్మేళనమే ‘ఎఫ్ 3’ అట.