ఆర్ఎక్స్ 100 చిత్రంతో ట్రెండ్ సెట్ చేసిన, ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఇంతవరకు తన రెండో సినిమా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళలేదు. ఆమధ్య మాస్ రాజా రవితేజతో సినిమా అనుకున్నాడు కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఆ తరువాత అజయ్ చాలామంది హీరోలని ట్రై చేసి చివరికి శర్వానంద్‌ను ఒప్పించాడు. ఇక రెండో హీరో కోసం టాలీవుడ్‌లో చాలా కష్టపడిన తర్వాత తమిళ హీరో సిద్దార్థ్‌ను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి, అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.
ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కి ఇలాంటి పరిస్థితి రావడంతో అజయ ఫస్ట్రేట్ అవుతున్నాడని సమాచారం. ఎందుకంటే హీరోలను ఒప్పించడానికే ఏడాది పట్టడంతో అజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడని సోషల్ మీడియాలో అజేయ్ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అజయ్ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు అని అంటున్నాడు. ఏది అయితేనేం ఫైనల్‌గా సినిమా అయితే సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి అనిల్ సుంకర ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ తర్వాత ఈసినిమా షూటింగ్ మొదలు కానుంది.