వరుస పరాజయాల తరువాత సాయి రామ్ శంకర్ ‘దిల్లున్నోడు’ సినిమాతో మనముందుకు రానున్నాడు. ‘బంపర్ ఆఫర్’ దర్శకుడు జయా రవీంద్ర మరోసారి శంకర్ తో పనిచేస్తున్నాడు. వేణుగోపాల్ నిర్మాత. కె.వి.వి సత్యన్నారాయణ సమర్పకుడు
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “తాను అనుకున్నది చెయ్యడం కోసం ఎంత రిస్క్ అయినా చేసే యువకుడి పాత్రలో మా హీరో కనిపిస్తాడు. అన్ని తరాల వారిని మెప్పించగలిగే చిత్రం అవ్వనుంది. పాటలు బాగా వచ్చాయి” అని తెలిపాడు. జాస్మిన్, ప్రియదర్శన్ హీరోయిన్స్
శేఖర్ చంద్ర సంగీతదర్శకుడు. ఈ సినిమా ఆడియో ఫిబ్రవరి 1న విడుదలకానుంది