దిల్ రాజు రిలీజ్ చేయనున్న డీ ఫర్ దోపిడీ

D_for_Dopidi_New_Posters-(3
హీరో నాని తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ‘డీ ఫర్ దోపిడీ’ కి భాగస్వామి అయ్యాడు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాని ఆంద్రప్రదేశ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఫ్రెష్ స్టొరీ లైన్ తో మంచి కామెడీ ఉంటుందని ఆశిస్తున్నారు.

వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని ఒక బ్యాంకు దొంగతనం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కించారు. రాజ్ నిడిమోరు – డికె కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో హీరో ని కూడా ఓ నిర్మాతగా ఇటీవలే జాయిన్ అయ్యాడు. ఈ సినిమా వచ్చే నెలలో ఆంధ్రపదేశ్ మరియు ఇతర లోకేషన్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version