‘తమ్ముడు’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్స్.. భారీగా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు!

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ కథగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా కంటెంట్‌పై మేకర్స పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

దీంతో ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘తమ్ముడు’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్స్ వేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. ఈ సినిమాను జూలై 3న రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని ఆయన భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.

ఈ సినిమా కంటెంట్‌పై ఎంత నమ్మకం ఉంటే మేకర్స్ ఇలా ముందు రోజే ప్రీమియర్ షోలు వేస్తారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version