“వి” రిజల్ట్ దిల్ రాజు కు ముందే తెలిసి ప్లాన్ చేసారా?


ఈ మధ్య కాలంలో మన సౌత్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల్లో కల్లా భారీ హైప్ తో వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “వి” సినిమాయే అని చెప్పాలి. నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నిన్న రాత్రి ప్రీమియర్స్ తో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కూడా అన్ని సినిమాల్లానే పెద్దగా విషయం లేదని టాక్ తెచ్చేసుకుంది.

దీనితో ఇపుడు నిర్మాత దిల్ రాజు ప్రెజన్స్ ఆఫ్ మైండ్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు ముందు చాలానే రచ్చ నడిచింది. స్ట్రీమింగ్ లోకి విడుదల చేయకూడదని ముందు గట్టిగానే స్టిక్ అయ్యి ఉన్నప్పటికీ తర్వాత మాత్రం రియలైజ్ అయ్యి అమెజాన్ ప్రైమ్ కు ఈ చిత్రాన్ని అమ్మేసారు.

అయితే ముందే ఇచ్చేస్తే సినిమాపై కూడా ఇంత హైప్ వచ్చి ఉండేది కాదు. పైగా ముందు టీజర్ తో నెలకొన్న అంచనాలు వారు పెంచుతూ రావడం మూలాన మంచి ఫ్యాన్సీ ప్రైస్ వరకు తెచ్చి అపుడు ఈ చిత్రాన్ని డిజిటల్ గా రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు. లేదంటే ఇప్పుడు వచ్చిన టాక్ ప్రకారం అయితే ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అంత మొత్తాన్ని రాబట్టలేదు. ఆ లెక్కన చూస్తే దిల్ రాజు ప్లానింగ్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి.

Exit mobile version