దిల్ రాజు నిర్మిస్తున్న మూడు చిత్రాలు హోల్డ్ లో ఉన్నాయి. వకీల్ సాబ్, హిందీ జెర్సీ రీమేక్ నిర్మాణ దశలో ఉండగా..నాని హీరోగా చేసిన వి విడుదల సిద్ధంగా ఉంది. మార్చి నెలలో ఉగాది కానుకగా వి చిత్రాన్ని విడుదల చేయాల్సివుంది. అప్పటికే లాక్ డౌన్ మొదలుకావడంతో అన్ని చిత్రాల విడుదలతో పాటు వి మూవీ విడుదల కూడా ఆగిపోయింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ తెరుచుకోనే సూచనలు కనిపించడం లేదు.
దీనితో దిల్ రాజు ఓ టి టి లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీ విడుదల మూడు నెలలకు పైగా ఆలస్యం కాగా దిల్ రాజు ఏమి చేయాలో తేల్చుకోలేకున్నారట. వి మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మరి ఈ మూవీ ఓ టి టి లో విడుదల చేస్తే ఎలాంటి డీల్ దక్కించుకుంటుందో. వి చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా..సుధీర్ ఓ కీలక రోల్ చేశాడు.