ధోని 100% కమర్షియల్ సినిమా


ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ధోని’. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా విలేఖరుల సమవేశం ఏర్పాటు చేయగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ధోని’ అనేది ఆఫ్ బీట్ లాంటి సినిమా కాదని 100% కమర్షియల్ సినిమా. అంతర్లీనంగా మెసేజ్ ఇస్తున్నాం. పిల్లల భావాలకు, పెద్దల ఆలోచనలకు మధ్య ఎంత అగాధం ఉందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాను నా కుటుంబంలో మరియు ఎన్నో కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యని దర్శకుడిగా చెప్పాలనే ఆలోచన నాలో ఎప్పటినుంచో ఉండేది.

అప్పుడే ధోని సినిమా అనుకోని దిల్ రాజుకి చెప్పాను. వేరే నిర్మాతల్ని సంప్రదించకుండా నేనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా మారి ధోని తీసాను. ఒక సందర్భంలో ఈ కథ పూరి జగన్నాధ్ కి చెబుతున్నపుడు అక్కడే ఉన్న పూరి అబ్బాయి ఆకాష్ విని ఈ సినిమాలో నేను నటిస్తాను అనడంతో ఆకాష్ ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకి ఇళయరాజా గారు సంగీతం అందించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారికి మా సంస్థకు ఎన్నో ఏళ్ళ అనుభందం ఉంది. ‘దిల్’ సినిమా నుండి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వరకు కలిసి పని చేసాం. ఈ సినిమాని తెలుగులో మేమే విడుదల చేయబోతున్నాం. తప్పకుండ మా సంస్థ నుండి రాబోతున్న మరో మంచి చిత్రం అవుతుంది అన్నారు.

Exit mobile version