టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ గా వెలుగొందుతున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొద్ది సేపటి క్రితం చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సినిమాలకు ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు సాయంత్రం తన స్వగృహంలోనే ఆయన తుది శ్వాసని విడిచారు.
ప్రకాశం జిల్లా బల్లి కురవ మండలం కొమ్మినేనివారిపాలెం లో జన్మించిన ధర్మవరపు ‘బావా బావ పన్నీరు’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. దూరదర్శన్ లో ఆయన చేసిన ‘ఆనందో బ్రహ్మ’ హాస్య సీరీయల్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ప్రముఖ హీరోల అందరి సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. తెలుగులో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ ఆయన డైలాగ్ డెలివరీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఆయన చంపోవడం టాలీవుడ్ కామెడీ రంగానికి, తన తోటి కమెడియన్స్ కి తీరని లోటు అనేది మాత్రం అర్థమవుతోంది.
ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.