మెగా హీరో సాయి ధరమ్ విమెన్స్ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. రెండు మూడేళ్ళ వయసులో ఉన్న ధరమ్ తేజ్ కి ఏదో సందర్భంలో వాళ్ళ అమ్మగారు ఆడ వేషం వేశారు. ఆ అరుదైన ఫోటోని ధరమ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఫ్యాన్స్ దానిని వైరల్ చేస్తున్నారు. ఇక ధరమ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో ట్రాక్ లోకి వచ్చారు. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బంపర్ హిట్ అందుకుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఫన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధరమ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది.
ఇక ప్రస్తుతం ధరమ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ధరమ్ కి జంటగా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది.