అక్కడ బ్రేకీవెన్ కొట్టేసిన ‘కుబేర’.. ఇక అంతా లాభాలే!

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున, రష్మిక మందన్నాలు కీలక పాత్రల్లో మన టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “కుబేర”. మంచి టాక్ తో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా ధనుష్ కెరీర్లోనే భారీ వసూళ్లు అందుకుని అదరగొట్టింది.

ఇలా ఫైనల్ గా యూఎస్ మార్కెట్ లో అయితే పెట్టుకున్న టార్గెట్ ని నేటికి రీచ్ అయ్యి బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. నార్త్ అమెరికాలో కుబేరకి ఇక నుంచి మొత్తం లాభాలే అని చెప్పవచ్చు. ఆల్రెడీ 2 మిలియన్ మార్క్ దగ్గరలో ఉన్న ఈ సినిమా శేఖర్ కమ్ముల నుంచి మరో 2 మిలియన్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు సహా అమిగోస్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Exit mobile version