ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

Published on Sep 25, 2025 10:01 AM IST

Dhanush

దర్శకుడిగా తన సత్తా చాటేందుకు ధనుష్ మరోసారి సిద్ధమయ్యాడు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఇడ్లీ కడై’ తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.

ఇక ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U సర్టిఫికెట్ పొందింది. తాజాగా ఈ చిత్ర రన్‌టైమ్‌ను రివీల్ చేశారు. ఈ చిత్ర నిడివి 147 నిమిషాలు (2 గంటలు 27 నిమిషాలు)గా ఖరారైంది.

ఈ చిత్రంలో అరుణ్ విజయ్, శాలినీ పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

తాజా వార్తలు