ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ప్రస్తుతం మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఎమ్ఎమ్ కీరవాణి దమ్ము సినిమాకి రీ రికార్డింగ్ చేయడం మొదలు పెట్టారు. దమ్ము చిత్రం పూర్తిగా చూసిన ఆయన సినిమాకి సంబందించిన సమాచారం ఆయన ట్విట్టర్ అకౌంటులో పెట్టారు. ‘ఇప్పుడే దమ్ము క్లైమాక్స్ సన్నివేశాలు తప్ప పూర్తి సినిమా చూసాను. ఈ రోజు నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రారంభించబోతున్నాను. ఎన్టీఆర్ స్టామినాని బోయపాటి బాక్స్ ఆఫీస్ కి చూపించబోతున్నాడు’ అని అన్నాడు. షూటింగ్ చివరి దశల్లో దమ్ము ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతుంది.