ఈ వారంలో రాబోతున్న ఎన్టీఆర్ ‘సింగమగన్’

ఈ వారంలో రాబోతున్న ఎన్టీఆర్ ‘సింగమగన్’

Published on May 8, 2012 11:06 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ తెలుగులో ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తమిళ్లో డబ్ చేసి విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11న ‘సింగమగన్’ పేరుతో తమిళనాడులో విడుదల చేయబోతున్నారు. త్రిషా మరియు కార్తీక ఇద్దరికీ అక్కడ మంచి క్రేజ్ ఉండటం ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ ‘రాగాలై’ (రచ్చ) మంచి విజయం సాధించడం, పెద్ద తమిళ సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు