అన్నపూర్ణ స్టూడియోలో దమ్ము షూటింగ్

అన్నపూర్ణ స్టూడియోలో దమ్ము షూటింగ్

Published on Mar 11, 2012 6:39 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంటుంది. మాకు తెలిసిన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇంటర్వెల్ కి ఉండు వచ్చే పాట చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఈ పాటలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుతున్నాయి. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 23న అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు