అక్టోబర్ మొదటి వారంలో ‘దేవరాయ’ ప్లాటినం డిస్క్


శ్రీకాంత్ రెండు విభిన్న పాత్రల్లో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘దేవరాయ’. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేసారు. చక్రి అందించిన ఈ చిత్ర ఆడియోకి మంచి ఆదరణ లబించడంతో ఈ చిత్ర ప్లాటినం డిస్క్ వేడుకని అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ చివర్లో విడుదల చేయనున్నామని ఈ చిత్ర దర్శకుడు నానిక్రిష్ణ తెలిపారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ శ్రీ కృష్ణదేవరాయలుగా మరియు అమలాపురంలో అల్లరిగా తిరిగే దొరబాబు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఈ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఆసక్తికరంగా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. శ్రీకాంత్ సరసన మీనాక్షి దీక్షిత్ మరియు విదిశ కథానాయికలుగా నటించారు. ఈ చిత్ర్రాన్ని కిరణ్ జక్కంశెట్టి నిర్మించారు.

Exit mobile version