ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్ గా ఓ కొత్త మార్పు వస్తోంది. ఆ మార్పుని కూడా ఈ తరానికి చెందిన డిజైనర్స్ తెస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ అనే దానిమీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ హౌస్ వారు కూడా గత 3/4 సంవత్సరాలుగా డిజైనర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలకి పర్సనల్ డిజైనర్స్ ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్ వారు కూడా కాస్ట్యూమ్స్, మేకప్ కోసం బాగా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు.
ఈ మార్పుకి గల కారణం ఏమిటి? ఇక్కడిలానే పక్క ఇండస్ట్రీల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కొత్త ట్రెండ్స్ సినిమాల లుక్ మరియు ఫీల్ విషయంలో బాగా ఎఫెక్ట్ చూపుతున్నాయి. సినిమా ప్రేక్షకులు కూడా ఫ్యాషన్ గురించి బాగా తెలుసు కుంటున్నారు. అలాగే ఇంటర్నెట్ అనేది బాగా ప్రాచుర్యం అవడంతో బి, సి సెంటర్ ప్రేక్షకులు కూడా గ్లోబల్ ఫ్యాషన్ గురించి తెలుసుకుంటున్నారు. దానివల్ల అభిమానులు తమ హీరోలు చాలా స్టైలిష్ గా, స్మార్ట్ గా, ట్రెండీగా కనపడలాని ఆశిస్తున్నారు. ఇప్పటివరకూ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ లుగా ఉన్నవారు స్పీడ్ గా జరుగుతున్న మార్పుని అందుకోలేకపోతున్నారు. దాంతో పర్సనల్ డిజైనర్స్ వస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల సినిమా ఫస్ట్ లుక్ కూడా చాలా కీలకం అవుతోంది. సినిమా ఫస్ట్ లుక్ లో హీరోని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసారా లేక పవర్ఫుల్ గా చూపించారా, అలాగే వారి పాత్రకి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని బట్టే ప్రజలు సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు.
ఇలాంటి మార్పులు రావడం వల్ల డిజైనర్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అశ్విన్, భాస్కర్, రమ రాజమౌళి, రూప వైట్ల, నీరజ కోన, షీలా లాంటి వారు ఇప్పుడొస్తున్న సినిమాల కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.