బన్నీ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా అల వైకుంఠపురంలో నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ నుండి నిన్న ఓ తొలగించబడిన సన్నివేశం విడుదల చేశారు. శుశాంత్ సీక్రెట్స్ తెలుసుకున్న బన్నీ, పనిష్మెంట్ గా సుశాంత్ ని రన్నింగ్ లో ఉన్న బస్ వెనుక పరుగెత్తిస్తాడు. మురళి శర్మ సైతం ఆ సన్నివేశంలో ఉన్నారు.
కాగా ఈ సన్నివేశం చూసిన నెటిజెన్స్ పెదవి విరిచారు. ఈ సన్నివేశం తొలగించి మంచిపనిచేశారంటూ తమ అభిప్రాయం బయటపెడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి అసలు ఆ సన్నివేశం ఉంటే సినిమా ప్లాప్ అయ్యేదంటూ జడ్జిమెంట్ ఇస్తున్నారు. చూడకపోతే మీరు ఓ సారి ఆ సీన్ ఏంటో చూసేయండి.