కాస్త ఆలస్యంగా రానున్న లెజెండ్ ఆడియో టీజర్

కాస్త ఆలస్యంగా రానున్న లెజెండ్ ఆడియో టీజర్

Published on Mar 5, 2014 11:40 AM IST

legend1
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీ ఆడియో టీజర్ ని అభిమానులకి స్పెషల్ ట్రీట్ గా ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయాలి. కానీ టెక్నికల్ పరంగా ఆలస్యం కావడంతో ఆడియో టీజర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మొదటిసారి బాలకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్
కాంబినేషన్ లో వస్తున్న ఈ ఆల్బం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. మార్చి 7న శిల్పకళావేదికలో ఆడియో వేడుక జరగనుంది.

బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ నటించారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడు. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి నిర్మంచారు.

తాజా వార్తలు