ఆర్ ఆర్ ఆర్ పూర్తయినా రిలీజ్ వాయిదా పడేదా..?

ఆర్ ఆర్ ఆర్ పూర్తయినా రిలీజ్ వాయిదా పడేదా..?

Published on Apr 25, 2020 6:58 AM IST

చాలా మంది సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకుడు రాజమౌళి కావడంతో దేశవ్యాప్తంగా మూవీపై హైప్ నెలకొని ఉంది. ఐతే ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సివుంది. షూటింగ్ అనుకున్న సమయానికి జరగకపోవడంతో మూవీ విడుదల వాయిదా పడింది. దీనితో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమాని చాల బాధపడ్డాడు. రాజమౌళి ఈ మూవీని చెప్పిన సమయానికి మరో ఆరునెలలు వాయిదా వేసి జనవరి 8, 2021కి మార్చాడు.

ఐతే ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చినా కరోనా దెబ్బకు బుక్ అవ్వాల్సి వచ్చేదని కొందరు అంటున్నారు. కరోనా వైరస్ కేసులు వందల నుండి వేలల్లోకి వెళ్లిన నేపథ్యంలో దేశంలో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. జులై వరకైనా థియేటర్స్ తేరుచుకుంటాయన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ అనుకున్నట్లుగా జులై 30న విడుదలకు సిద్దమైనా… థియేటర్స్ బంధ్ కారణంగా విడుదల వాయిదా వేయాల్సివచ్చేది.కావున ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వచ్చినా కరోనా దెబ్బకు బుక్ అయ్యేదని కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు