దీపికా @8 గంటల వర్క్.. ఈ సిస్టంపై సంచలన కామెంట్స్ వైరల్

దీపికా @8 గంటల వర్క్.. ఈ సిస్టంపై సంచలన కామెంట్స్ వైరల్

Published on Oct 10, 2025 9:00 AM IST

deepika

ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ గా వైరల్ అయ్యిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దీపికా పదుకోణ్ అనే చెప్పాలి. పలు సినిమాల నుంచి ఆమెని తొలగించడం ఆమె పెట్టిన కండిషన్స్ వంటివి వైరల్ గా మారాయి. అయితే అవి అప్పటికి టాక్ మాత్రమే కానీ అసలు దీనిపై ఆమె ఓపెన్ అయ్యి మళ్ళీ చేసిన పలు షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనితో ఆమె కేవలం 8 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటాను అని చెప్పింది నిజమే అని తెలిపింది.

అయితే ఇండియన్ సినిమా దగ్గర ఎంతో మంది సూపర్ స్టార్ హీరోలు కూడా కేవలం 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తారు, వీకెండ్స్ షూటింగ్ లో పాల్గొనరు ఈ విషయం ఎందుకు హెడ్ లైన్స్ ఎక్కలేదు అనేది మాత్రం అర్ధం కాదని ఆమె తెలిపింది. అంతే కాకుండా ఇండియన్ సినిమాపై కూడా పలు సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మన ఇండస్ట్రీ ఒక వ్యవస్థ లేని ఇండస్ట్రీ అని ఒక సిస్టం ఇక్కడికి తీసుకురావాలని కామెంట్స్ చేయడం జరిగింది. దీనితో తన నుంచి ఈ షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు