బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే రోజు రోజుకి మరింత ఉన్నత స్థానాలకు వెళుతోంది. ఇప్పటి వరకూ బాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాల్లో కనిపించిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ లో ఓ క్రీజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం దీపిక పడుకొనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సక్సెస్ అయిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమా సీక్వెల్ లో చాన్స్ కొట్టేసింది.
హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటించనున్నారు. హీరోయిన్స్ మిచెల్లె రోడ్రిగ్యూఎజ్, జోర్డన్న బ్రెవ్స్టర్ లతో దీపిక జాయిన్ కానుంది. ఈ మూవీలో దీపిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ 6 కి ఇక్కడ మంచి బిజినెస్ జరిగింది. ఈ మూవీ 7వ పార్ట్ 2014 లో ఉంటుందని భావిస్తున్నారు.