టాలీవుడ్ లో చాల సినిమాలు, కనీసం ఒక్క షెడ్యూల్ నైనా యూఎస్ లో ప్లాన్ చేసుకుంటారు. అయితే కరోనా పుణ్యమా అని అంత ఈజీగా వీసాలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కరోనా పోయేవరకూ అసలు షూటింగ్ కూడా చేసే అవకాశం లేదు. దాంతో ఫారెన్ లో ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్స్ అన్ని ఇప్పటికే రద్దయ్యాయి. అయితే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్న వారికీ ఇపుడు ఉన్న బెస్ట్ ఆప్షన్ రామోజీ ఫిల్మ్ సిటీ. కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ ని ప్లాన్ చేయాలని చాలమంది మేకర్స్ భావిస్తున్నారు.
దాంతో యూఎస్ లొకేషన్స్ అవసరం ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకోనున్నాయి. ఆ రకంగా రామోజీ ఫిల్మ్ సిటీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. డేట్స్ వైజ్ గా షూటింగ్ కి పెర్మిషన్ ఇస్తున్నారట. ముందుగా భారీ స్టార్ హీరోల సినిమాలకు, అలాగే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సిన సినిమాలకు ఫిల్మ్ సిటీ వారు ముందుగా డేట్స్ ఇస్తున్నట్లు.. వారికి కావాల్సిన లొకేషన్స్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేది ఏమి లేక మేకర్స్ కూడా ముందుగానే ఫిల్మ్ సిటీలో తమకు కావాల్సిన లొకేషన్ ను బుక్ చేసుకుంటున్నారు.