‘సూపర్ డూపర్’ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసిన మాస్ రాజా..!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ నుంచి దీపావళి కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా నుంచి ‘సూపర్ డూపర్ హిట్టు సాంగ్’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎనర్జిటిక్ సాంగ్‌గా ఈ పాట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ పాటను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version