‘థగ్ లైఫ్’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ ఫిక్స్!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష, శింబు ప్రధాన పాత్రల్లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రమే ‘థగ్ లైఫ్’. అయితే ఈ చిత్రం విడుదల దగ్గరకి వస్తుండగా ఆల్రెడీ మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ట్రైలర్ కూడా వచ్చాక మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ కాగా రెండో సాంగ్ కి ఇపుడు డేట్ ఫిక్స్ చేశారు.

త్రిష పై షుగర్ బేబీ అంటూ సాగే ఈ సాంగ్ ని ఈ మే 21న విడుదల చేస్తున్నట్టుగా లాక్ చేశారు. మరి త్రిషపై మంచి రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఆస్కార్ విజేత రెహమాన్ ఇచ్చిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రం ఈ జూన్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version