‘మాస్ జాతర’ టీజర్ కి డేట్, టైం వచ్చేశాయ్!

‘మాస్ జాతర’ టీజర్ కి డేట్, టైం వచ్చేశాయ్!

Published on Aug 9, 2025 1:11 PM IST

Mass-Jathara

మాస్ మహారాజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే “మాస్ జాతర”. మంచి బజ్ ఉన్న ఈ సినిమాతో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని కూడా అందుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ రాఖి పౌర్ణమి కానుకగా సాలిడ్ అప్డేట్ అందించారు.

ఈ సినిమా తాలూకా టీజర్ ని ఈ ఆగస్ట్ 11న ఉదయం 11 గంటల 8నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసేసారు. ఇక దీనిపై విడుదల చేసిన పోస్టర్ కూడా రవితేజ నుంచి మంచి మాస్ ఫైర్ లో నిండిపోయింది. ఇక ఆరోజున వచ్చే టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మరి ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు