తెలుగు ఇండస్ట్రీకి పెద్దవాడు, 150 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ఏడాదిన్నర తర్వాత తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘వడ్డీ కాసుల వాడు’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఈ చిత్ర విశేషాలను చెప్పారు. దర్శకరత్న మాట్లాడుతూ ‘ నా తదుపరి చిత్రం ‘వడ్డీ కాసుల వాడు’. ఈ సినిమాని నా పుట్టినరోజున (మే 4న) ప్రారభించనున్నాము. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ ప్యూన్ కథే ఈ సినిమా. ఆ ప్యూన్ పాత్రని నేనే వేస్తున్నాను. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమాలో విషయం సీరియస్ గానే ఉన్నా సినిమా మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని’ అన్నారు.
అలాగే మాట్లాడుతూ ‘ ఇది కాకుండా నా సొంత బ్యానర్ లో మూడు సినిమాలను నిర్మిస్తున్నాను. అందులో ఒకదానికి రేలంగి నరసింహారావు డైరెక్టర్, మరొక చిత్రం ద్వారా కో డైరెక్టర్ రవి డైరెక్టర్ అవుతున్నాడు. మూడవ సినిమాకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇవి కాకుండా మోహన్ బాబు – వడ్డే రమేష్ కలిసి నిర్మించే సినిమాకి నేను దర్శకత్వం వహించనున్నాను. అందులో మంచు విష్ణు హీరోగా నటిస్తాడు. వీటన్నిటికీ మధ్యలో పూర్తి కొత్త నటీనటులతో ఒక లవ్ స్టొరీ మూవీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాని’ అన్నారు.