నిఖిల్, స్వాతి జంటగా నటించిన స్వామి రారా సినిమా విజయం దాసరి నారాయణ రావు గారిని ఎంతగానో మెప్పించింది. స్వామి రారా లాంటి మరో పది సినిమాలు తొందర్లో వస్తే తెలుగు సినిమా ఎంతగానో వృద్ధి చెందుతుంది అన్నారు. ఆయన మాట్లాడుతూ “ఈ రోజుల్లో ప్రతీ సినిమాలోనూ ఆరు పాటలు నాలుగు ఫైట్ లు ఉంటున్నాయి. కానీ తమిళ, మలయాళ మరియు హిందీ సినిమాలో చాలా మార్పు వచ్చింది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. చిన్న సినిమాలు సైతం బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు సాదిస్తున్నాయి. ఈ కారణం వల్లే స్వామి రారా సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. రెగ్యులర్ తెలుగు సినేమాలలా కాకుండా, ఈ చిత్రాన్ని ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. కానీ, ఈ చిత్రానికి తగిన న్యాయం జరగలేదని నేను భావిస్తున్నాను. బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న సమయంలో, పెద్ద సినిమాల కోసం చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించారు. నేనే డిస్ట్రిబ్యూషన్ చేసి ఉండి ఉంటే ఈ సినిమా 25 సెంటర్లలో 100 రోజులు అడేలా చూసేవాడిని.” అన్నారు. నిఖిల్, స్వాతి మరియు దర్శకుడు సుధీర్ వర్మ తమ సినిమాని ఆధరించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.