వాళ్ళ అఫైర్ చాలా మందిని చంపేసిందట.!

వాళ్ళ అఫైర్ చాలా మందిని చంపేసిందట.!

Published on Oct 13, 2020 12:12 PM IST

ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలలోనే వింత వింత సినిమాలు తీసే దర్శకునిగా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిలబడతాడు. ఎవరికీ తట్టని ఐడియాలు అన్నీ అతనికే వస్తాయో ఏమో కానీ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అలా తీస్తూనే వెళ్ళిపోతాడు వర్మ. అలా ఇటీవలే అనౌన్స్ చేసిన చిత్రం “డేంజరస్”.

ఈ చిత్రంతో మన దేశం లోనే ఒక ఊహించని ట్రాక్ ను పట్టుకున్నాడు. ఇద్దరి లెస్బియన్ అమ్మాయిల మధ్య రిలేషన్ తో అడల్ట్ క్రైమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ చిత్రంలో ఈ ఇద్దరి అమ్మాయిల మధ్య ఉన్న అఫైర్ చాలా మంది ప్రాణాలు తీస్తుంది అని అందులో గ్యాంగ్ స్టర్స్ ఉన్నారు అలాగే పోలీసులు కూడా ఉన్నారని ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నారు.

అయితే ఈ ఇద్దరు అమ్మాయిల రోల్స్ లో నైనా గంగూలీ మరియు అప్సరలు కనిపిస్తున్నారు. మొన్ననే అనౌన్స్ చేసిన ఈ సినిమాను నైనా గంగూలీ అపుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. మరి ఈ సరికొత్త తరహా చిత్రం వర్మ ముందు చిత్రాల్లానే మొదట హైప్ తెచ్చుకొని తర్వాత తుస్సుమంటుందా ఏమో చూడాలి.

https://www.instagram.com/p/CGRV0UYhrN-/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు