అన్నపూర్ణ స్టుడియోలో దమ్ము కొత్త షెడ్యుల్

అన్నపూర్ణ స్టుడియోలో దమ్ము కొత్త షెడ్యుల్

Published on Jan 3, 2012 9:29 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్ర షూటింగ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబందించిన కొత్త షెడ్యుల్ జనవరి 6 నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యుల్లో ఒక పాట చిత్రీకరించనున్నారు. దమ్ముకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అధికారికంగా ఎన్టీఆర్ అభిమానులకు సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. దమ్ము చిత్రం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దమ్ము ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు