ఉత్తరాంధ్ర లో భారి ధరకు అమ్ముడుపోయిన దమ్ము


యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ నటించిన “దమ్ము” చిత్రం పరిశ్రమ లో మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ చిత్ర డిస్ట్రిబ్యుషన్ హక్కులను పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర హక్కులను 3.45 కోట్లకు కొన్నట్టు సమాచారం ఇందులో విశాఖపట్టణం,విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి. ఈ హక్కులను భరత్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. 2012 ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు అలేగ్జాందర్ వల్లభ నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా త్రిష ప్రధాన పాత్రలో నటించారు.

Exit mobile version