‘డమరుకం’ సెన్సార్ వాయిదా పడింది


‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోవాల్సింది కానీ అది వాయిదా పడింది. ఈ చిత్రానికి సెన్సార్ రేపు జరగనుంది. ఈ రోజు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా సెన్సార్ జరగడంతో రేపటికి వాయిదా వేశారు. ‘డమరుకం’ కూడా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగార్జున కెరీర్లో భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రం డమరుకం. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమారు 45 నిమిషాల పాటు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఉంటాయి. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు. ఈ చిత్ర ఆడియో ఆల్బం మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో డా. వెంకట్ నిర్మించారు.

Exit mobile version