మే నెలలో రానున్న డమరుకం ఆడియో

మే నెలలో రానున్న డమరుకం ఆడియో

Published on Apr 4, 2012 9:25 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న డమరుకం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మాకు అందిన సమాచారం ప్రకారం మే 6న ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్త గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సిజిఐ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జూన్ మూడవ వారంలో డమరుకం సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తన పంథా మార్చుకుని సోషియో ఫాంటసిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు