నవీన్ చంద్ర , కిషోర్ మరియు పియా భాజ్ పై నటిస్తున్న ‘దళం’ సినిమా ఎట్టకేలకు జూలై మూడవ వారంలో విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ చిత్రవిడుదల పలుమార్లు జాప్యం జరిగినా నిర్మాతలు ఈ నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్.జీ.వి స్కూల్ నుండి వచ్చిన జీవన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. ఎం. సుమంత్ కుమార్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ “నిజజీవితంలో ఎదురైన పలు సంఘటనల ఆధారంగా ఈ సినిమా కధకు స్పూర్తి చెందాం. సమాజంలో కలవడానికి ప్రయత్నించే ఎక్స్-నక్సలైట్ల బృందం పడే కష్టాలను చూపించాం. ఈ చిత్రం ప్రజలకు, ప్రభుత్వానికి మరియు రాజకీయనాయకులకి పలు ప్రశ్నలను సందిస్తుందని” తెలిపాడు. నటాలియ కౌర్ ఐటెం సాంగ్ లో మెరవనుంది. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించాడు