‘చుట్టాలబ్బాయి’గా రానున్న రానా?

‘చుట్టాలబ్బాయి’గా రానున్న రానా?

Published on Mar 27, 2014 12:28 PM IST

daggubati-rana
టాలీవుడ్ యంగ్ హీరో రానా ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు ఇవి పూర్తయ్యాక సోలో హీరోగా సినిమాలు చేయడానికి కథలు వింటున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రానా ‘యువత’, ‘సోలో’ ఫేం పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పటికే పరశురామ్ వినిపించిన లైన్ బాగా నచ్చడంతో రానా ఓకే చెప్పాడు. ప్రస్తుతం పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే ఈ సినిమాకి ‘చుట్టాలబ్బాయి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన, హీరోయిన్, టెక్నీషియన్స్ గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు