సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ హీరోలుగా నటిస్తున్న ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాంకు రాబరీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా సిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా మెలాని కన్నోకద హీరోయిన్ గా పరిచయమవుతోంది. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, మెలాని కన్నోకద లపై షూట్ చేసిన ప్రమోషనల్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని ఈ వారం విడుదలవుతోన్న ‘నాయక్’ సినిమాతో పాటు వేయనున్నారు. ‘ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – వినాయక్ గారి నాయక్ సినిమాతో పాటు మా సినిమా ట్రైలర్ వేస్తున్నందుకు చోటా మామకి, దానయ్య గారికి నా ధన్యవాదాలు అని’ సందీప్ కిషన్ ట్వీట్ చేసాడు. రాజ్ – డి.కె నిర్మించిన ఈ సినిమాకి మహేష్ శంకర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఆడియో ఈ నెలాఖరున రానుంది.