సమ్మర్ కి వాయిదా పడ్డ డీ ఫర్ దోపిడీ

సమ్మర్ కి వాయిదా పడ్డ డీ ఫర్ దోపిడీ

Published on Feb 5, 2013 11:05 AM IST

d-for-dopidi

వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్,రాకేష్ కీలక పాత్రలు పోషించిన ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా రిలీజ్ ని సమ్మర్ కి వాయిదా వేశారు. ముందుగా ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. వరుణ్ సందేశ్ నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమా ఫిబ్రవరి 15న రిలీజ్ కానుంది. అలాగే సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరీ 21న రిలీజ్ కానున్న ‘గుండెల్లో గోదారి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండనున్నాడు.

ఈ సినిమాలో నటించిన మెయిన్ హీరోలు ఇద్దరూ బిజీగా ఉండడంతో ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుకున్న బ్యాంక్ రాబరీ తప్పు దారిలో వెళుతుందని చెప్పే కీలక పాత్రని మెలనీ కన్నోకద పోషించింది. సిరాజ్ కల్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రాజ్ – డికె కలిసి నిర్మించారు. మహేష్ శంకర్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు