రామ్ సినిమాని తాకిన తుపాను.!

రామ్ సినిమాని తాకిన తుపాను.!

Published on Oct 31, 2012 7:18 PM IST


నియాం? ఏంటి నియాం అనుకుంటున్నారా ప్రస్తుతం తమిళనాడు మరియు ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల్ని వణికిస్తున్న తుపాను పేరే నియాం. ఇది చెన్నై మరియు నెల్లూరులోని ప్రజలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ రెండు ఏరియాల్లో ప్రస్తుతం బలమైన సుడి గాలులు మరియు అధికంగా వర్షం పడుతూ అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తోంది.

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న ‘ఒంగోలు గిత్త’ సినిమా షూటింగ్ ఈ భారీ వర్షాల వల్ల ఆగిపోయింది. సినిమా కోసం వేసిన సెట్ కూడా నీటితో నిండిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ రెండు రోజుల తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. ‘ భారీగా వచ్చిన వాన మరియు గాలి వల్ల షూటింగ్ ఆగిపోయింది. రేపు కూడా షూటింగ్ జరిగే అవకాశం లేదని నాకు అనిపిస్తోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని రామ్ ట్వీట్ చేసారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు