కొన్నాళ్ళు కొనసాగితే అందరు ఓటి టి బాటపట్టాల్సిందే

కొన్నాళ్ళు కొనసాగితే అందరు ఓటి టి బాటపట్టాల్సిందే

Published on Apr 26, 2020 8:01 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలవుతుండగా, అనేక సినిమాల షూటింగ్స్ మరియు విడుదలకు బ్రేక్ పడింది. టాలీవుడ్ లో భారీ మరియు మీడియం బడ్జెట్ సినిమాలు దాదాపు 10వరకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లాక్ డౌన్ ముగిస్తే ఈ చిత్రాలు విడుదల చేయాలని చూస్తున్నారు. రానా అరణ్య, అనుష్క నిశ్శబ్దం, నాని వి భారీ చిత్రాల జాబితాలో ఉన్న విడుదలకు సిద్దమైన చిత్రాలు. వీటితో పాటు ఉప్పెన, లవ్ స్టోరీ, 30రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా వంటి మీడియం మరియు స్మాల్ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఐతే ఈ లాక్ డౌన్ ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే డైరెక్ట్ ఓ టి టి లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. విడుదల ఆగిపోయి పెట్టుబడి లాక్ అయ్యి ఇబ్బంది పడుతున్న మీడియం మరియు చిన్న చిత్రాల నిర్మాతలు నేరుగా డిజిటల్ ఫార్మట్ లో విడుదలకు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతారామమ్ అనే చిన్న సినిమా జీ 5 లో నేరుగా విడుదల చేస్తున్నారు. ఈనెల 29 నుండి ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

తాజా వార్తలు