‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారని టాక్ నడిచింది. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను కూడా తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్టు జీ స్టుడియోస్ కంపెనీ, ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.