బాలయ్య బాబు – బి.గోపాల్ కలయికలో రాబోతున్న సినిమా కోసం టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఫుల్ స్క్రిప్ట్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయి మాధవ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తండ్రి ప్రేమను అర్ధం చేసుకోలేని కూతురు సెంటిమెంట్ తో సాగే ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను సాయి మాధవ్ రాసాడట. ఏభై ఏళ్ల వయసు ఉన్న ఓ పోలీస్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక బాలయ్య అంటేనే.. యాక్షన్, ఆ యాక్షన్ కి ఎమోషన్ కూడా తోడైతే హిట్ గ్యారంటీ. పైగా బాలయ్య బాబు – బి.గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.