పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఇపుడు పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా దీనిపైనే ఎనలేని హైప్ ఉంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి పవన్ కూడా డేట్స్ ఇచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుండగా ఈ టాక్ తోనే మరో క్రేజీ రూమర్ ఈ సినిమాపై అందులోని పవన్ కళ్యాణ్ సీన్ కోసం వినిపిస్తుంది.
దీని ప్రకారం పవన్ పై ఒక షర్ట్ లేకుండా యాక్షన్ సీన్ ఉంటుందని ఇపుడు నడుస్తున్న టాక్. ఇందులో ఎంతమేర నిజం ఉందో కానీ పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎప్పుడో కొన్ని సినిమాలకి మాత్రం షర్ట్ లేకుండా కనిపించాడు. ఆ తర్వాత అలాంటి సన్నివేశాలే చేయలేదు. మరి మళ్ళీ ‘ఓజి’కి అంటున్నారు కాబట్టి ఇది వినేందుకు అభిమానులకి ఎగ్జైటింగ్ గానే ఉంది కానీ ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.